Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిగజారిన టీమిండియా... మెరుగైన కోహ్లీ ర్యాంకు

ఆసీస్ పర్యటనలో సిరీస్ చేజారడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మరోస్థానం దిగజారింది. ఆస్ట్రేలియా జట్టు చేతిలో 2-0 తేడాతో ఓటమిపాలవడంతో భారత జట్టు టెస్టుల్లో ఓ స్థానం కోల్పోయి ఏడో ర్యాంక్ కు పడిపోయింది. కాగా, సిరీస్ చేజారినప్పటికీ సిరీస్ లో అద్భుతంగా రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. మూడు స్థానాలు మెరుగు పడిన కోహ్లీ 12వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. సిరీస్ ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ (4) సాధించాడు.

More Telugu News